రేవంత్ రెడ్డి వెంట నడుస్తాం, ఏబిసిడి సాధిస్తాం

ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

రేవంత్ రెడ్డి వెంట నడుస్తాం, ఏబిసిడి సాధిస్తాం

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగ సమాజం ఏబిసిడి వర్గీకరణ సాధిస్తుందని ఎస్సి కార్పోరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్  పిడమర్తి రవి పేర్కొన్నారు. జనగామ పట్టణంలో జరిగిన మాదిగ అసెంబ్లీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ, 12 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సమాజం సంఘాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి వర్గీకరణ అమలు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారని, దీనిని మాదిగల పట్ల ఆయన కమిట్మెంట్‌గా భావించాల్సిన అవసరం ఉందన్నారు.
మాదిగల సంక్షేమం కోసం మాదిగ సమాజం ఏకతాటిపై రావాలని పిలుపు,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో వర్గీకరణ చేయాలని, ముఖ్యంగా జనసంఖ్య ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్గీకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో, మాదిగల మద్దతు పూర్తిగా ముఖ్యమంత్రికి ఉండాలని పిడమర్తి రవి పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి మైసా ఉపేందర్ మాదిగ, ఇరిగి సుధాకర్ మాదిగ, ఎనగందుల గణేష్ మాదిగ, పోలెపాక జితేందేర్ తదితరులు హాజరయ్యారు.WhatsApp Image 2024-12-07 at 9.32.26 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .