చెడు వ్యసనాలతో భవిష్యత్తు నాశనం యువత మత్తుకు దూరంగా ఉండాలి

బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్

చెడు వ్యసనాలతో భవిష్యత్తు నాశనం యువత మత్తుకు దూరంగా ఉండాలి

మంచిర్యాల బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, మాదకద్రవ్యాలు సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు ఆకర్షితులై, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి ఉత్తర్వుల మేరకు మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఆదేశానుసారం శనివారం జిల్లాలోని బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో గంజాయి, మాదకద్రవ్యాల వాడుకం, వాటి వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలూద్దీన్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి ఏ రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ, గంజాయి తదితర మాదకద్రవ్యాలపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, గంజాయి, మాదకద్రవ్యాలు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత ఆకర్షితులై, జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బెల్లంపల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మిన, పీల్చిన, పోలీసుల దృష్టికి తీసుకురావాలని, గంజాయి మహమ్మారి నిర్మూలనలో తమ వంతుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. విద్యార్థిని విద్యార్థులు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులందరూ స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా, ఉన్నత చదువులు చదువుకొని, జీవితంలో మంచి స్థాయికి వచ్చి, వారి తల్లిదండ్రులకు, చదువుకున్న విద్యాసంస్థలకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం ఇటీవల యాంటీ డ్రగ్స్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి 2టౌన్ ఎస్ఐ మహేందర్, పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .