గద్దర్ ప్రధమ వర్ధంతిని జయప్రదం చేయండి
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు:
ప్రజా యుద్ధ నౌక, వాగ్గేయ కారుడు గద్దర్ ప్రధమ వర్ధంతిని విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ ప్రతిష్టాప కమిటీ పిలుపునిచ్చారు. కాజీపేట లోని మీడియా పాయింట్ లో గురువారం నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రసంగించారు ఈ సందర్భంగా గద్దర్ ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని ఆగస్టు 31వ తేదీన హనుమకొండ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మడి సూర్య కిరణ్, విమలక్క, ప్రొఫెసర్. కూరపాటి. వెంకటనారాయణ, సి. యల్. యాదగిరి, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, సాయిని నరేందర్, సోమ రామ్మూర్తి, వనజక్క లు హాజరుగానున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర శ్రీనివాస్, కొండ్ర నర్సింగరావు, దూడల సాంబయ్య, సాయిని నరేందర్, గజాల గోవర్ధన్, గద్దర్ సాంబయ్య, సింగారపు అరుణ, మచ్చ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments