రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కృషి చేయాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కు వినతిపత్రం
*తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని న్యాయవాది, తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజలింగు మోతే, జిల్లా సభ్యుడు మాడుగుల కుమార్ లు కోరారు. ఈ మేరకు జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కు ఆయన నివాసంలో సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు, కుల దూషణలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ లపై జరుగుతున్న అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ నిరోధక చట్టం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అట్రాసిటీ నిరోధక చట్టం నిర్వీర్యం కాకుండా చూడాలని, గ్రామస్థాయిలో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు చేపడితేనే బలహీన వర్గాల ప్రజలైన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.


Comments