భాగస్వామ్య పింఛను పథకంను రద్దు చేయాలి

భాగస్వామ్య పింఛను పథకంను రద్దు చేయాలి

మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:

భాగస్వామ్య పింఛన్ పథకంను రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేసేలా పాలకులకు బుద్ధి ప్రసాదించాలని దైవాన్ని వేడుకున్నట్లు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యూనైటెడ్ ఫ్రంట్ ,ఎన్ఓపిఆర్ యూ , ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కురువపురం దత్తక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 16న యుపిఎస్ ,ఎన్పీఎస్ ల రద్దు కోరుతూ, కొత్త ఢిల్లీలో జరుప తలపెట్టిన భారీ సదస్సు విజయవంతం కోసం శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. న్యూ స్కీం రద్దు చేసే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రధాని కార్యాలయం వరకు గలం వినిపించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, సన్నాహక సమావేశంలో తమ తమ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం కూడా తమ పోరాటానికి అవసరమని భావించి ఆదివారం దత్తాత్రేయ స్వామిని వారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .