ప్రజా సమస్యలపై విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

ప్రజా సమస్యలపై విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

* -సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* స్థానిక తెలంగాణ చౌక్ వద్ద సిపిఎం, సిపిఐ (వామపక్ష పార్టీల) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బషీర్ భాగ్ విద్యుత్ పోరాటంలో అమరవీరులైన బాలస్వామి,రామకృష్ణ, విష్ణువర్ధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి 2నిమిషాలు మౌనం పాటించారు.

*సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...

* నాటి తెలుగుదేశంలోని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయకూడదని డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న దశలో చంద్రబాబు ప్రభుత్వం పాశవీకంగా కాల్పులు జరిపిందని ఈ కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ విష్ణువర్ధన్, అమరులయ్యారని అనేకమంది గాయాలపాలు అయ్యారని అన్నారు. వారి త్యాగం వృధాగా పోలేదని నేటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందుతుందంటే ఆనాటి ఉద్యమస్ఫూర్తి నే అన్నారు. గృహ విద్యుత్తు పెరగకుండా బలహీన వర్గాలకు పేదలకు విద్యుత్ సరఫరా మంచినీటి, సరఫరాలకు స్థానిక సంస్థలకు ఇస్తున్న రాయితీలు ఆనాడు వామపక్షాల ఆధ్వర్యంలో లక్షలాది మంది జరిపిన ఐక్య పోరాటం ఫలితంగానే నేడు విద్యుత్ చార్జీలు పెరగకుండా ఉన్నాయని అన్నారు. 

* నేడు కేంద్ర ప్రభుత్వం మళ్లీ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజల నుండి భారీగా పన్నులు వసూలు చేయాలని చూస్తుందని, విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న రైతు,కార్మిక వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. ఇప్పటికి అనేకమంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుబంధు డబ్బులు జమ కావడం లేదని,డబల్ బెడ్ రూములు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు అందడం లేదని, గత పాలకులు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలనే నేటి పాలకులు అనుసరిస్తున్నారని ప్రజా సమస్యలపై నిరంతరం వామపక్ష పార్టీలు ఐక్యంగా బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని అన్నారు

* ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,కిన్నెర మల్లమ్మ, సిపిఎం నాయకులు జి. తిరుపతి,గజ్జల శ్రీకాంత్ ,పున్నం రవి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నలువాల సదానందం న్యాలపట్ల రాజు, సదాశివ, సిపిఎం నాయకులు రాయి కంటి శ్రీనివాస్, రోహిత్, బోగేష్, ఆకాష్, సిపిఐ నాయకులు B.యుగేందర్, మచ్చ రమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .