55 ద్విచక్ర వాహనాలను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు 

ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

55 ద్విచక్ర వాహనాలను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు 

  ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

న్నావాహనాలకు రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా వుండాలని, లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. 

శనివారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో నగరంలో నెంబర్ ప్లేట్ , రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 55 ద్విచక్ర వాహనదారులతో ఏసీపీ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే నిందుతులు పోలీసుల నుండి సీసీ కెమెరాల నుండి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాల నెంబరు ప్లేట్ లను తొలగిస్తున్నారని అన్నారు.  అదేవిధంగా చోరి చేసిన వాహనాలతోనే ఎక్కువ నేరాలు చేస్తున్నారని పెర్కొన్నారు. దొంగిలించిన వాహనాలు నకిలీ పత్రాలు సృష్టించి తక్కువ ధరలకు విక్రయిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యక్తులు వాహనాలు కొనుగోలు, అమ్మకాలు చేసినట్లతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మార్పు చేసుకోవాలని లేదంటే ఎదైనా  నేరాలలో మీ వాహనాలు వున్నట్లు గుర్తిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి జరిమానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ ను వంచినా, ముగుసు వేసినా, పూర్తిగా లేకుండా చేసిన వారని గుర్తించి వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు ఆవుతాయని అన్నారు. ప్రస్తుతం నంబర్ లేకుండా  పట్టుబడిన వాహన పత్రాలు, చాయిస్ నెంబర్లు తనిఖీ చేస్తూ.. చోరికి గురైన వాహనాలు ఏమైనా వున్నాయో లేదో ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తునట్లు తెలిపారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై మరింత  దృష్టి పెట్టమని  అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా ఎంవీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని, ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే జైలు శిక్ష, లేదా జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు ఎస్సై రవి, సాగర్, రాము పాల్గొరు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .