శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపిఎస్
వరంగల్ క్రైమ్,తెలంగాణ ముచ్చట్లు:
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. నెల వారి నేర సమీక్షలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.డిసిపిలు,ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ వారిగా పెండింగ్ కేసులు, కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టు, రుజువుల సేకరణ, కోర్టులో కేసుల ప్రస్తుత స్థితిగతులపై పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సూదీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాల్సిందిగా అలాగే మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగం స్పందించాలని, అక్రమంగా పిడిఎస్ రైస్, ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలని దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రధానం చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడంలో అధికారులు సమయస్పూర్తి వ్యవహరిస్తూ దర్యాప్తు కోనసాగించాల్సి వుంటుందని
అలాగే తరుచుగా నేరాలకు పాల్పడే నేరస్థులపై సస్పెక్ట్, రౌడీ షీట్ల తెరవాలని రానున్న పంచాయితీ ఎన్నికలను దృష్టిలో వుంచుకోని స్టేషన్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి తగు సమాచారాన్ని సేకరించాల్సి వుంటుందని పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారితో స్నేహపూర్వకంగా వుండాలని భాధ్యయుతంగా విధులు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్‌తో పాటు, ఏసిపిలు జితేందర్ రెడ్డి, మధుసూధన్, దేవేందర్ రెడ్డి, కిషోర్ కుమార్, పార్థసారధి, విజయ్‌కుమార్, తిరుపతి, భీంశర్మ, సైదులుతో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.


Comments