అంతర్జాతీయ కరాటే పోటీల్లో రాణించిన పోలీస్ తనయుడు.
వరంగల్ క్రైమ్,తెలంగాణ ముచ్చట్లు:
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో రాణించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపిఎస్ బుధవారం ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే మడికొండలోని సిటి పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తమిళ ఆనందం కుమారుడు సాయి వంశీ గత నెల నవంబర్ 7వ తేది నుండి పదవ తారీఖు వరకు గోవాలో నిర్వహించిన 24వ ఏఫ్.ఎస్.కె.ఏ వర్డల్ కప్ కరాటే చాంఫియన్‌షిప్ పోటీల్లో సాయి వంశీ స్పారింగ్ విభాగంలో రజిత పతకం గెలుచుకోగా, కాటా విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుని అంతర్జాతీయ కరాటే పోటీల్లో తన సత్తా చాటాడు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తన కార్యాలయములో సాయి వంశీని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తమ పిల్లలను క్రీడల్లో వున్న ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించాలని, ముఖ్యంగా నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు సైతం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిమచడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించడం సంతోషదాయకమని పోలీస్ కమిషనర్ తెలిపారు.


Comments