114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్ 

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్ 

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి  ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు చేసే వారు, కట్టే వారిని మొత్తం 114 మందిని బైండోవర్ చేసినట్లు సత్తుపల్లి పట్టణ సీఐ కిరణ్ వివరించారు. బుధవారం 54 మందిని, గురువారం 63 మందిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హాజరుపరిచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోడిపందేలు మరియు పేకాట నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంక్రాంతి పండుగను ఉద్దేశించి, కోడిపందేలు మరియు జూదం నిర్వహణను నివారించేందుకు మండల, గ్రామస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కోడిపందేలు నిర్వహించేందుకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్ లను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .