సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్‌ చర్యలు

-ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారాయణ

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్‌ చర్యలు

వరంగల్ క్రైమ్,తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారాయణ, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మార్పు చేసిన సందర్భంలో, వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై కూడా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనే హెచ్చరిక జారీ చేశారు.

మంగళవారం ట్రాఫిక్‌ పోలీసులు అదాలత్‌ జంక్షన్‌లో అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్‌ రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ చర్య వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా  ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సైలెన్సర్లపై తీసుకోబడిన చర్యగా వివరిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీలలో, నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లను ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి, వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను తొలగించారు. ఈ సైలెన్సర్లను వినియోగించకుండా రోడ్‌ రోలర్‌ సాయంతో 263 సైలెన్సర్లను ధ్వంసం చేశారు. వీటిలో హనుమకొండకు 120, కాజీపేటకు 82, వరంగల్‌ నగరానికి 61 సైలెన్సర్లు ఉంటాయి.

ఈ కార్యక్రమంపై మాట్లాడిన ట్రాఫిక్‌ ఏసిపి, సత్యనారాయణ మాట్లాడుతూ, “సిపి అదేశాల మేరకు, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని” స్పష్టం చేశారు. ఆయన పేర్కొన్నట్లుగా, శబ్ద కాలుష్య నియంత్రణతో ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సైలెన్సర్ల మార్పు పై ప్రత్యేక దృష్టి సారించబడుతోంది.కంపనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలి. ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్‌ మార్పు చేస్తే, వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోబడతాయని, ఆర్టీఐ ద్వారా 3 నెలల పాటు లైసెన్సు రద్దు చేయబడుతుందని, వాహనాన్ని సీజ్‌ చేయబడుతుందని ఏసిపి తెలిపారు.

అలాగే, మెకానిక్లను కూడా సైలెన్సర్ల మార్పు చేయడానికి ప్రోత్సహించకూడదని, సహకరించిన మెకానిక్లపై కూడా క్రిమినల్‌ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్లు రామకృష్ణ, సీతారెడ్డి, నాగబాబు, ఎస్‌.ఐలు క్రాంతికుమార్‌, రామారావు, ఇతర ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .