ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం.
అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి.
- మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి హెచ్చరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు నిబంధనలపై హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినట్లు అయితే ప్రమాదం జరిగే కష్టాలను కళ్ళకు కట్టినట్లు వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు. సందర్భంగా సిఐ రేణుక రెడ్డి మాట్లాడుతూ..ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా రోడ్డుపైనకు రావద్దని. కాగితాలు లేని నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేటు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రయాణం ప్రమాదకరమని వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ ఎవరు మాట్లాడకూడదని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం అత్యవసరమైతే వాహనాన్ని రోడ్డు పక్కకు నిలుపుకొని ఫోన్ మాట్లాడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. నిబంధనలు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజూ పోలీసులు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో టేక్మాల్ ఎస్సై రాజేష్, ఏఎస్సై తుక్కయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు..jpeg)


Comments