పోలీసులు ప్రజలతో సన్నిహితంగా మెలగాలి.
ఖాజీపేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పుప్పాల తిరుమల్
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు;
వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ను ఖాజీపేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పుప్పాల తిరుమల్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎసీపికి పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకరు. ముందుగా ఖాజీపేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల ట్రిపుల్ సి పిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు, అలాగే కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ చేరాలును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పరిశీంచారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖాజీపేట డివిజన్ మాట్లాడుతూ శాంతి భద్రత నియంత్రణ కై పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత మనందరి బాధ్యతని, ప్రధానంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలని,ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని అన్నారు. ఫిర్యాదు వచ్చి వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీసులు నీజాయితీ తో పనిచేయాలని తెలిపారు. చివరగా ఎసీపి చేతులమీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.ఈ తనిఖీల్లో, ఇన్స్ స్పెక్టర్ వి. చేరాలు, ఎస్సైలు రవి, సిద్దయ్య తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


Comments