పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ దొపిడి దొంగల ముఠా సభ్యులు

పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ దొపిడి దొంగల ముఠా సభ్యులు

వరంగల్ క్రైమ్,తెలంగాణ ముచ్చట్లు:

గత నెల 18వ తేది అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌.బి.ఐ బ్యాంక్‌లో దోపిడికీ పాల్పడిన ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు ఒక కోటి ఎనబై లక్షల నాలగువేల రూపాయల విలువ గల  రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా,ఐపిఎస్  వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులతో పాటు, పరారీలో మరో నలుగురు నిందితులు ఏడుగురు సభ్యులు ముఠా ఏర్పాడ్డారు. పరారీలో వున్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల  కిందిత ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వుండే బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులు కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని  సేకరించడం జరిగింది. సేకరించిన సమచారంలో  నిందితులు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ చోరీ అనువైనదిగా గుర్తించి ఈ బ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడ్డారు. ఈ చోరీలో భాగంగా నవంబర్‌ 18తేది అర్ధరాత్రి తెలవారితే 19 తారీకున నిందితులు హైదరాబాద్‌ నుండి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్‌ చేస్తున్న  ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతాన్ని చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారుని వెనక్కి తిప్పి పంపారు. అనంతరం మిగితా ఆరుగురు నిందితులో పంట పొలాల ద్వారా నిందితులు రాయపర్తి కేంద్రంలోని ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకొని అక్కడ వున్న కిటీకిని నిందితులు తొలగించి బ్యాంక్‌ లోనికి చొరబడిన ఈ ముఠా సభ్యులు ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు, సిసి కెమెరాల వైర్లను నిందితులు కట్‌ చేసి ఇద్దరు నిందితులను తొలగించిన కిటీకి వద్ద కాపలగా వుంచి ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టి, స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను ఈ ముఠా తమ వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్లను వినియోగించి లాకర్లను కట్‌ చేసి అందులోవున్న సూమారు 13కోట్ల 61లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకోని వారి వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ ఇతర స్వామగ్రిని బ్యాంక్‌లో వదిలి వేయడంతో పాటు అక్కడి నుండి వెళ్ళే ముందుగా సిసి కెమెరాల సంబంధించిన డివిఆర్‌ను ఈ ముఠా ఎత్తికెళ్లారు. చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌ కిరాయి తీసుకున్న ఇంటికి చేరుకొని నిందితులు చోరీ సొత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్‌ 19వ తేదిన నిందితులు మూడు బృందాలు వీడిపోయిన మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్ళిపోయారు.
ఈ భారీ చోరీపై అప్రమత్తమైన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలకో వర్థన్నపేట ఏసిపి నర్సయ్య, సిసిఎస్‌ ఏసిపి భోజరాజు, నర్సంపేట ఏసిపి కిరణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో పదిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుల పట్టుకోవడ కోసం ఈ ప్రత్యేక పోలీస్‌ బృందాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టి నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించి  ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు వారి నుండి చోరీ సోత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ భారీ చోరీని అతి స్వల్పకాలంలో చేధించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌, ఏసిపిలు నర్సయ్య, భోజరాజు, కిరణ్‌కుమార్‌, ఆత్మకూర్‌, రఘునాథ్‌పల్లి, సిసిఎస్‌, వర్థన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చెందిన ఇన్స్‌స్పెక్టర్లు సంతోష్‌, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్‌, శివకుమార్‌, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్‌రావు, మహేందర్ రెడ్డి, అబ్బయ్య, పవన్‌కుమార్‌, విశ్వేశ్వర్‌, ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు ఎస్‌.ఐలు, ఇతర దర్యాప్తు పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.WhatsApp Image 2024-12-06 at 9.57.19 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .