మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపకుడు మైస ఉపేందర్ మాదిగ
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
మాదిగల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు మైస ఉపేందర్ మాదిగ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో గురువారం ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేపట్టాలని, ప్రతి జిల్లాలో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు.మాదిగలు ఎస్సీ వర్గీకరణలో తీవ్రంగా నష్టపోతున్నారని, వారి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మైస ఉపేందర్ మాదిగ స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరిగితేనే మాదిగల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాదిగల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని మైస ఉపేందర్ కోరారు.


Comments