ప్రజావాణిలో 126 ఫిర్యాదులు స్వీకరణ
వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ హరిప్రియ, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిలతో కలిసి ఆమె సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొత్తం 126 ఫిర్యాదులు అందాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల జిల్లా అధికారులు పరిశీలించి, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ ప్రజలు సమర్పిస్తున్న వినతులపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అన్నారు. చేపట్టిన ప్రతి చర్యను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత శాఖలు వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.సిఎంఓ ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని ఆమె సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments