తిరుమల నాద స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాల 2వ రోజు వైభవం
Views: 3
On
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాద స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాల 2వ రోజు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సేవకాలం, నివేదన హారతి, తీర్థ ప్రసాద గోష్ఠి, ద్వారతోరణ పూజ, అగ్ని ఆరాధన, మూలమంత్ర హవనం, వేద దివ్యప్రబంధ పారాయణ, నిత్యపూర్ణహుతి వంటి వైదిక కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలో జరిగాయి.
పూజా కార్యక్రమాలకు ఆలయ ప్రధాన అర్చకులు కలకోట రామనుజాచార్యులు నేతృత్వం వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ సునీత దంపతులు, వర్షిణి, కుంభం నరేందర్ హేమలత, దేవకి, నిర్మల, సౌమ్య, విమల, యాదమ్మ, రాజు, గోపి తదితరులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments