సీఎం కప్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3 పథకాలు 

స్టేట్ పవర్ లిఫ్టింగ్ లో 2 బంగారు పతకాలు, 1 కాంస్య పతకం

సీఎం కప్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3 పథకాలు 

- జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు 

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
సీఎం కప్ లో భాగంగా, ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, రెండు బంగారు పతకాలు ఒక కాంస్య పతకం, సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి తెలిపారు. గెలుపొందిన క్రీడాకారుల్లో  66 కేజీల పురుషుల విభాగంలో మోడెం వంశీకి బంగారు పతకం, 57 కేజీల మహిళల విభాగంలో  బట్టు శ్వేత కి బంగారు పతకం, 62 కేజీల విభాగంలో ఎస్కే రేష్మా కి కాంస్య పతకం  వచ్చినట్లు తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను జిల్లా  స్పోర్ట్స్ ఆఫీసర్, పరంధామ రెడ్డి  రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు, వి మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు  భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ  జీవీ రామిరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కోశాధికారి మహంతి వెంకటకృష్ణాజి  సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టర్  మరియు పట్టణ ప్రముఖులు, పలు క్రీడా సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, పట్టణ ప్రముఖ సంఘ సేవకుడు, గాదె మాధవరెడ్డి, మరియు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సభ్యులు తదితరులు అభినందించడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .