అల్వాల్ గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడి ఖాతాలో 3వ విడత నిధులు జమ
నిరుపేద లబ్ధిదారుడికి ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
– అల్వాల్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు జి. సుదర్శన్ రెడ్డి
పెద్దమందడి,నవంబర్11( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు జమ చేసింది. లబ్ధిదారులలో నాగమ్మ భర్త చిన్న కొండన్న ఖాతాలో మూడవ విడతగా రూ.1,40,000 జమ కాగా, మొదటి విడత నుండి ఇప్పటివరకు మొత్తం రూ.3,40,000 అందినట్లు వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న ఈ చర్య పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అల్వాల్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు జి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజంగా పేదల కలలను నెరవేర్చే పథకం. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం ఇస్తోంది. గ్రామంలో సాంక్షన్ అయిన ప్రతి లబ్ధిదారుడికి ఎటువంటి ఆలస్యం లేకుండా నిధులు జమవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఇళ్లు పూర్తి చేసుకోవాలి అని తెలిపారు.అలాగే, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వసతి లేని కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు జి. చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కె. బల్రెడ్డి, బి. కురుమూర్తి, నరేందర్, నాగరాజు, ఎస్. రాజు,నరేందర్ రెడ్డి, బలన్న ,తదితరులు పాల్గొన్నారు.


Comments