బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందే.
హాసన్ పర్తి,అక్టోబర్ 18(తెలంగాణ ముచ్చట్లు):
హాసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో శనివారం రాష్ట్ర బిసి బంద్ సందర్బంగా జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, బంద్ నిర్వహిచారు.
42%బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీల భవిష్యత్తు,ఆత్మ గౌరవం, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణలు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ బందు సందర్బంగా బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల గౌడ్ ఆదేశాల మేరకు నేడు వంగాపహాడ్ గ్రామంలో బీసీ నేత మెరుగు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ బందుకు సంపూర్ణంగా మద్దతు తెలిపి రోడ్డు పై బైటయించి రాస్తా రోఖో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కూనూరు రాకేష్ గౌడ్,జూలూరు రాజు,బొమ్మగాని వెంకటేష్ గౌడ్, దూలం సురేష్ గౌడ్,దూలం రాజు గౌడ్,సముద్రాల మధు,గండు రాజయ్య,గండు రమేష్,ములకలపల్లి రాజు,మహమ్మద్ రబ్బాని,పున్నం రమేష్,గండు అశోక్,ఇంజపురి రాము,కోరే రవి,మూనుకుంట్ల నాగరాజు,దోమకుమార్,చింతం శీను,గండు సురేష్, మెరుగు రాజు,మాచర్ల రాజకుమార్,వరికోలు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments