నకిలీ పత్రాలతో రూ. 50 కోట్ల భూమి కబ్జా యత్నం 

భూ బాధితులు రేఖా, రజిత రెడ్డి ఆవేదన

నకిలీ పత్రాలతో రూ. 50 కోట్ల భూమి కబ్జా యత్నం 

WhatsApp Image 2025-09-22 at 9.39.22 PM (1)నాగారం, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి గ్రామంలోని భూమిని కాపాడేందుకు భూ బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాంపల్లి గ్రామంలో రేఖా రెడ్డి, రజిత రెడ్డి సొంత భూమిని కాపాడేందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భూ బాధితులు సోమవారం విలేకరులతో సమావేశం నిర్వహించి, సుమారు రూ. 50 కోట్ల విలువ కలిగిన భూమిని సుబ్బారెడ్డి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి 50 మంది గుండాలతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
రేఖా, రజిత రెడ్డి తెలిపారు, “రాంపల్లి ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న మా భూమిని సుబ్బారెడ్డి కబ్జా చేయడానికి ప్రహరీ గోడ, చెట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భూమిపై మా హక్కులను కాపాడే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి.”భూ బాధితుల పిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఈ సందర్భంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, కబ్జాదారుల నుండి భూమిని రక్షించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.జెమ్మల నాగేష్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు, “మాకు సుబ్బారెడ్డి తో ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో మాకు తెలియదు. రేఖా రెడ్డి, రజిత రెడ్డి కుటుంబ సభ్యులకు భూమి విక్రయించారని సత్యం.”గ్రామస్తులు మరియు స్థానికులు భూమి సొంత హక్కులను కాపాడే విధంగా పోలీసులు భద్రతను పెంచి, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .