జనగామ జిల్లా స్త్రీ నిధి రుణాలను 50 శాతం రికవరీ చేయాలి

జనగామజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు

జనగామ జిల్లా  స్త్రీ నిధి రుణాలను 50 శాతం రికవరీ చేయాలి

జనగామ తెలంగాణ ముచ్చట్లు :

స్త్రీ నిధి రుణాలను 50 శాతం రికవరీ చేయాలని *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు,జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల సమాఖ్య అధ్యక్షులు, ఏపీఎంలతో స్త్రీ నిధి జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 12 మండలాల వారీగా మొత్తం టీఎల్ఎఫ్ లు ఒకటి, ఎస్ఎల్ఎఫ్ లు 36 కాగా సెర్ప్ కింద వీఓలు 466 మంది ఉన్నారన్నారు. మహిళా శక్తి పథకం కింద కొత్త ఎంటర్ప్రైజ్ లకు స్త్రీ నిధి అధిక రుణాలను నిబంధనల మేరకు మంజూరు చేయాలన్నారు. క్రెడిట్ ప్లాన్ పెంచాలన్నారు. తక్కువ శాతం స్త్రీ నిధి రుణాల రికవరీ ఉన్న మండలాలు తప్పనిసరిగా 50 శాతం రికవరీకి చేరుకోవాలని సూచించారు. అలాగే 33 నుంచి 55 శాతం రుణాల రికవరీ ఉన్న మండలాలు కచ్చితంగా 65 శాతం లక్ష్యాన్ని సాధించాలని, రఘునాథపల్లి, జనగామ మండలాలు 85 శాతం రుణాల రికవరీ సాధించాలని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 10 నుంచి 15 లోపు పూర్తవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా పెండింగ్ రుణాల రికవరీకి విజిట్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించి పరిష్కరించాలన్నారు. ప్రతి వీఓ ప్రణాళికాబద్ధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైతే స్త్రీ నిధి రుణాల రికవరీ సరిగా చేయకుండా, క్రెడిట్ ప్లాన్ రుణాలను మంజూరు చేయకపోయినా, లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసినా, అటువంటి వీఓఏలను తొలగిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. 

అంతకుముందు మండల సమాఖ్య అధ్యక్షులు, ఏపీఎంలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మండలాల వారీగా సమీక్షించారు.

అనంతరం సంబంధించిన లబ్ధిదారులతో మాట్లాడి, వారికి తగిన సూచనలు చేశారు

ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీఏ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ వినోద్ కుమార్, డీవీహెచ్ఓ ఎస్ఎల్ మనోహర్, అడిషనల్ డీఆర్డీఏ సెర్ప్శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షులు ఏపీఎంలు, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ లు,తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .