గొల్లకురుమల హక్కుల సాధన కోసం ప్రజాభవన్ ముట్టడికి పిలుపు

గొల్లకురుమల హక్కుల సాధన కోసం ప్రజాభవన్ ముట్టడికి పిలుపు

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:

గొల్లకురుమలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై పోరాటం తారస్థాయికి చేరుకుంది. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈనెల 9న ప్రజాభవన్ ముట్టడిని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ హామీలు ఎక్కడికి పోయాయి?
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గొల్లకురుమల కోసం ప్రత్యేక హామీలు ఇచ్చింది. వాటిలో రెండో విడత DDలు తీసుకున్న వారికి గొర్రెల పంపిణీ, మిగిలిన వారికి రూ. 2 లక్షల నగదు బదిలీ, గొర్రెల ప్రమాద బీమా పథకం, గొర్రెల కాపరులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒక్క గొర్రెకు రూ. 10 వేల ఇన్సూరెన్స్, 50 సంవత్సరాలు దాటిన వారికి నెలకు రూ. 5000 పింఛన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రచారంలో ముందుకు తెచ్చింది. అయితే, ప్రభుత్వం అవి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బాలరాజు అన్నారు.

ప్రస్తుత సమస్యలు
గొల్లకురుమలు ఎటువంటి రక్షణ లేకుండా జీవిస్తున్నారని, రాత్రి వేళ గొర్రెలను కుక్కలు చంపడం, దొంగల బెడద, అటవీశాఖ ఆంక్షలు, పశువైద్య సౌకర్యాల అభావం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. పశువైద్య ఖాళీ పోస్టుల భర్తీ, అవసరమైన మందుల సరఫరా, జీవో 559 అమలు వంటి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.


గొల్లకురుమల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా వ్యాప్తంగా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, పార్టీలకు అతీతంగా అందరూ ప్రజాభవన్ ముట్టడిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎంటే శ్రీనివాస్, దొరగోళ్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .