మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి నిర్వహణకు పిలుపు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా ఖిలా వరంగల్ మండల కేంద్రంలోని రంగశాయిపేట, శంభునిపేట జంక్షన్ వద్ద గోడపోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. నేడు నిర్వహించే పూలే వర్ధంతి కార్యక్రమాలను కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరపాలని ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు కోరుతున్నాయి.ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహాత్మ పూలే సిద్ధాంతాలు, సమాజానికి ఆయన అందించిన సేవలు కొత్త తరాలకు చేరువ కావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్, విద్యార్థి ఉద్యమ నేత కే యూ జేఏసీ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గద్దల కుమారస్వామి, బీఆర్‌ఎస్ రైతుబంధు మండల అధ్యక్షుడు తరగల ప్రసాద్, ఎం ట్వంటీ వన్ నాయకులు మైదం సంజీవ, నీలం సంజీవ, ట్రేడ్ యూనియన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.


Comments