మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ వద్ద నల్ల బ్యాడ్జిలు,హెల్మెట్లు ధరించి జర్నలిస్టుల భారీ నిరసన.

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

మీడియా ప్రతినిధులపై దాడి చేసి విచక్షణా రహితంగా వ్యవహరించిన నటుడు మంచు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్, టీవీ 5 కెమెరామెన్ సూర్యం, ఈటీవీ కంట్రిబ్యూటర్ లపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జర్నలిస్ట్ యూనియన్ల నేతలు, పలువురు జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు, హెల్మెట్లు ధరించి భారీ నిరసనకు దిగారు. కేంద్రం స్పందించి ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటుడు మోహన్ బాబు, ఆయన అనుచరుడి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టులపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. మోహన్ బాబును అరెస్టు చేసి చేయాలని, ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జిలు, తలలకు హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి అమర్, టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్.లెనిన్, జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్, టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుమాధవ్, మాజీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, సీనియర్ జర్నలిస్టులు గిడుగు కృష్ణమోహన్, పొగాకుల అశోక్, కేకే, టీయూడ్బ్లుజే-143 వరంగల్ జిల్లా కన్వీనర్ కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్, జర్నలిస్టులు పబ్బు సతీష్, వేణు, తిరుపతి, వెంకటరత్నం, రవిచంద్ర, చేతి శ్రీనివాస్, గొట్టె వెంకన్న, వేణుప్రసాద్,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోకారపు శ్యాంకుమార్‌, బొడిగ శ్రీను, సహాయ కార్యదర్శి పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు గుండబోయిన దిలీప్‌, దొమ్మటి శ్రీకాంత్, జనగాని ఆంజనేయులు, ట్రైబల్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్‌ వెంకట్‌, బూరం ప్రశాంత్‌, తోట తిరుమల్, అనిల్, వెంకట్, రాకేష్, పాషా,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .