బలమైన ఆహారం తింటేనే పిల్లల శారీరక, మానసిక ఎదుగు తారు.

-కామన్ డైట్ కార్యక్రమలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

బలమైన ఆహారం తింటేనే పిల్లల శారీరక, మానసిక ఎదుగు తారు.

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

బలమైన ఆహారం తింటేనే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణ  ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభోత్సవం  సందర్భంగా శనివారం  అర్బన్ మండలం గొల్లగూడెం రోడ్ లోని తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు, కూరగాయలు, సరుకులను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలు, విద్యాబోధన గురించి పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా వుండాలని, అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్  లింకులు ఓపెన్ చేయడం ద్వారా  బ్యాంక్ ఎకౌంట్ వివరాలు సైబర్ నేరుగాళ్ళకి చిక్కుతుందని తద్వారా అకౌంట్ లోని డబ్బులు పోతాయని అన్నారు.  సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, పోలీసులు నిరంతరం  మీ సేవలో ఉంటారని ఎవరికైనా  ఆపద కలిగితే వెంటనే డయల్ 100, సైబర్  నేరాలకు1930 కు ఫోన్ చేయాలని తెలిపారు.మాదకద్రవాల వాడకం వలన జరిగి నష్టాలను గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ మైనారిటీ  మహిళా స్కూల్, కాలేజీ రెసిడెన్షియల్  ప్రిన్సిపల్    సీతామాలక్ష్మి అర్బన్ సీఐ భాను ప్రకాష్, ఆర్ ఐ  వహీద్   పాల్గొన్నారుWhatsApp Image 2024-12-14 at 6.26.58 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .