స్నేహితుడి కుటుంబానికి చేయూత

మానవత్వం చాటిన బాల్యమిత్రులు 

స్నేహితుడి కుటుంబానికి చేయూత

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కానపురం గోపి అనారోగ్యంతో బుధవారం ఆకస్మిక మృతి చెందడం జరిగింది. తనతో పాటు కలిసి పదవ తరగతి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు గోపి ఆకస్మికంగా మృతి చెందడంతో స్నేహితులు చలించిపోయారు. 2003-2004 బ్యాచ్ మేట్స్( పదవ తరగతి) స్నేహితుని కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించి స్నేహితులందరూ కలిసి గోపి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్ననాటి స్నేహితుడి చనిపోవడంతో స్నేహితులందరూ కలిసి మానవత్వ దృక్పథంతో గోపి కుటుంబానికి 50000/- యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్నేహమంటే కేవలం స్కూళ్లు, కాలేజీలు దాటి వరకే కాదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా తోడు ఉంటుందని చాటి చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి బంధాన్ని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అయితే ఒక స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటా. కేవలం సంతోషంలోనే కాదు, కష్టాల్లోనూ తోడుండే వాడే స్నేహితుడు. ఏ బంధం లోనైనా స్వార్థం ఉండొచ్చు కానీ స్నేహంలో మాత్రం ఇలాంటి స్వార్థాలు ఉండవని చెబుతుంటారు దానిని స్నేహితులు నిరూపించారు. స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు. అన్ని విధాల గోపి కుటుంబానికి అండగా ఉంటామని చిన్ననాటి స్నేహితులు హామీ ఇచ్చారు. గోపి చిన్న కూతురు పేరు మీద 50000/-వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. గోపి మృతికి సంతాపం తెలిపి వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని స్నేహితులు కల్పించారు.ఈ కార్యక్రమంలో నక్కల సుజాత, ఇర్కిచెట్టి సుజాత, ఎం.వేణు యాదవ్, కన్నె నరసింహ, ఏ.తిరుపతయ్య, విష్ణు, ఏ. నాగేశ్వర్, ఏ.రాఘవ, జి.హరినాథ్, పి. ఆంజనేయులు, సత్యనారాయణ, రామకృష్ణ, సి. నాగరాజు, డి. ధర్మేందర్, సి.శ్రీనివాసు, డి.రాఘవేంద్ర, కార్తీక్ గౌడు, జి.మన్నెంకొండ, నరేష్, కిషోర్, మహేష్, బాలకృష్ణ, కురుమూర్తి, పి.నాగార్జున,ఇస్మాయిల్, రాకేష్, తెలుగు శ్రీను, కాంగ్రెస్ నాయకులు డిఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .