సామాజిక ఉద్యమం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి
ప్రముఖ పత్రిక విలేఖరికి ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడి బెదిరింపులు.
పత్రికలో పేరు రాయ నందుకు ఫోన్లో దుర్భాషలు.
హసన్ పర్తి. సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ నాయకుడి ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మార్పీఎస్ నాయకుడి పై కేసు నమోదైనట్లు హసన్ పర్తి సిఐ చేరాలు తెలిపారు.హసన్ పర్తి పోలీసులు తెలిపిన ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతిలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న కందుకూరి సంజీవ్ కు ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడు ఆరేపల్లి పవన్ ఈనెల 16న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి నేను ఎన్నో ఉద్యమాలు చేశానని నా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తే నా పేరు ఎందుకు రాయలేదు అంటూ ఎవడో సోమన్నను హైలైట్ చేసి రాశావంటూ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి సోయి లేకుండా అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు నోటితో చెప్పలేని బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడని అంతేకాకుండా మీ పత్రికలో నా పేరు ఎందుకు రాయలేదు అంటూ అంబేద్కర్ ను తెచ్చిందే నేను సమాజాన్ని చదివింది నేనే మీరంతా నన్నే మొక్కాలంటూ హుకుం జారీ చేస్తూ నీ ఇంటికి వచ్చి నీ అంత చూస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు.బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చీరలు పేర్కొన్నారు.


Comments