ఆదివాసి అడవి బిడ్డ పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

---వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధమ్మ 

ఆదివాసి అడవి బిడ్డ పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసి అడవి బిడ్డ పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధమ్మ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధమ్మ మాట్లాడుతూ... ఆదివాసి బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేసి చనిపోయిందనీ నిర్ధారించుకుని ఇక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. ఆదివాసి మహిళా కొనఊపిరితో పోరాడుతూ రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో ఉందని అన్నారు. నిందితుడుపై సిఎస్పి అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఉరిశిక్ష ఇదించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఘటన చాలా బాధాకరమని, రేవంత్ సర్కార్ అండతోనే అడవి బిడ్డలపై దారుణాలకు పాల్పడుతూ... అత్యాచార కేసును యాక్సిడెంట్ కేసుగా మార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. లేనిపక్షంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితురాలు కేసు పెడుతుందనే భయంతోనే నిందితుడు అడవి బిడ్డను హతమర్చే ప్రయత్నం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల కఠినంగా వ్యవహరించి , నిందితులకు వెంటనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వని రాధ అధ్యక్షురాలు వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు కల్పన జిల్లా ఉపాధ్యక్షురాలు అర్చన జిల్లా జిఎస్ షుగర్ లక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి సరోజ మాజీ కౌన్సిలర్ సు మిత్రమా టౌన్ ప్రెసిడెంట్ ఆవుల కవిత కార్యదర్శి విమల హారిక కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .