పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో వరుస దొంగతనాలు.

ప్రకాశ్‌నగర్‌ కాలనీలో ఎంపీపీ ఎస్ గంగారం హెచ్‌డబ్ల్యూ పాఠశాల

పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో వరుస దొంగతనాలు.

- గ్రామస్థుల్లో ఆందోళన

సత్తుపల్లి, అక్టోబర్‌ 28 (తెలంగాణ ముచ్చట్లు)

ప్రకాశ్‌నగర్‌ కాలనీలో గల ఎంపీపీ ఎస్ గంగారం హెచ్‌డబ్ల్యూ పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో వరుసగా దొంగతనాలు చోటుచేసుకోవడంతో గ్రామంలో కలకలం రేగింది. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి పలు వస్తువులు అపహరించిన ఘటనలు గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రధానోపాధ్యాయుడు ఏ. సాంబశివరావు వివరిస్తూ — “ఉదయం పాఠశాలకు వచ్చి చూసే సరికి తలుపు తాళం పగిలి ఉండటాన్ని గమనించాను. లోపల బీరువా కూడా పగలగొట్టబడి ఉంది.రాత్రి దొంగలు చొరబడి పాఠశాల వస్తువులు అపహరించారు,” అని తెలిపారు. WhatsApp Image 2025-10-28 at 3.08.47 PMWhatsApp Image 2025-10-28 at 3.08.41 PM

ఇదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం కూడా దొంగల బారిన పడింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తాళం పగలగొట్టి చిన్నారుల కోసం ఉంచిన వంట పాత్రలు, పాలు, నూనె, బాలామృతం ప్యాకెట్లు వంటి వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం అంగన్వాడీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవలి కొన్ని రోజులుగా గ్రామంలో ఇలాంటి దొంగతనాలు పెరగడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. పాఠశాలలు, అంగన్వాడీల వద్ద రాత్రి భద్రతా చర్యలు పెంచాలని గ్రామస్థులు అధికారులును కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .