1984 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల ఆత్మీయ కలయిక

1984 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల ఆత్మీయ కలయిక

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎంపికైన1984 బ్యాచ్ కానిస్టేబుళ్లు నగరంలోని ప్రవేటు హొటల్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఖమ్మం జిల్లాలో  కానిస్టేబుల్స్‌గా ఉద్యోగం ప్రారంభించి హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ హోదాల్లో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వీరందరనీ తోటి సహచరుల ప్రోద్బలంతో నాలుగు దశాబ్దాల తర్వాత ఆత్మీయ కలయిక ద్వారా కలుసుకుని ఆనందంగా గడిపారు. 105 మంది సివిల్ కానిస్టేబుల్స్ బ్యాచ్ లో ప్రస్తుతం 41 మంది సర్వీసులో ఉండగా, 39 మంది ఉద్యోగ విరమణ పొందగా 25 మంది చనిపోయారు. ఆత్మీయులంతా చాలా కాలం తరువాత కుటుంబాలతో కలసి సేద తీరారు. ఈ కార్యక్రమానికి చనిపోయిన వారి కుటుంబాలను సైతం ఆహ్వానించి వారిని శాలువలతో సన్మానించారు. ఈ సందర్బంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. గత స్మృతులు నెమరువెసుకొని ఆహ్లాదకరంగా గాడిపారు. పోలీస్ సర్వీస్ చేసుకున్న తీపి గుర్తుగా మేమంటోలు తయారు చేసుకొని ఒకరినొకరు బహుకరించుకున్నారు.మోహన్ రావు, రామచంద్రరావు, రాయప్ప, శ్రీశైలం, రహీమ్, శ్రీనివాసులు, మాదల శ్రీనివాసరావు, పూనాటి సత్యనారాయణ, ప్రత్యేక చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .