మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఆధ్వర్యం లో జలమండలి ఎండీని కలిసిన బృందం
ఏ ఎస్ రావు నగర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ,డా. ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఆధ్వర్యంలో మంగళవారం ఖైరతాబాద్‌లోని హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కార్యాలయాన్ని సందర్శించిన బృందం, ఎండీ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినారు.ఈ సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్ పగుళ్లు, కాల్వల వృధాగా నీరు పోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు వంటి ప్రజా సమస్యలను ఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా వేసవికాలంలో తాగునీటి కొరతను నివారించే చర్యలు, కాలనీలలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా కొత్త పైప్‌లైన్‌ల ఏర్పాటు, మురుగునీటి శుద్ధి కేంద్రాల విస్తరణ వంటి అంశాలపై చర్చ సాగింది.ఎండీ అశోక్ రెడ్డి ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ఆప్యాయంగా స్వీకరించి, ప్రజలకు తాగునీటి మరియు కాల్వల సంబంధిత సదుపాయాలు సమర్థంగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్–2 అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, కార్యదర్శి పెద్దాపురం కుమార స్వామి, బీఆర్‌ఎస్ నాయకులు ఎస్.ఎ. రహీమ్, వంజరి ప్రవీణ్ కరిపే తదితరులు పాల్గొన్నారు.


Comments