రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.
హసన్ పర్తి,డిసెంబర్ 23 (తెలంగాణముచ్చట్లు): వరంగల్ పోలీస్ కమిషనరేట్ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవన్నపేట గ్రామానికి చెందిన యువకుడు మంగళవారం రోజున మృతి చెందినట్లు హసన్ పర్తి సిఐ చేరాలు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హసన్ పర్తి మండలం మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన పంజాల భూపాల్ చిన్న కుమారుడు అయిన పంజాల చరిత్ కుమార్ (27) మంగళవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు టీఎస్ 03 ఎఫ్ యు 9125 నంబరు గల హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై దేవన్నపేట గ్రామం నుండి నిరూప్ నగర్ తండా కి బయలుదేరుగా ఉనికిచెర్ల వైపు వెళుతున్న టీజీ 25 0799 నెంబరు గల టిప్పర్ డ్రైవరు అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు డివైడర్ పై నుండి దూసుకెళ్లి నిరూప్ నగర్ తండా వద్ద చరిత్ కుమార్ నడుపుతున్న ద్వి చక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో చరిత్ కుమార్ అక్కడికక్కడే మరణించినట్లు హసన్ పర్తి సీఐ చేరాలు తెలియజేశారు. మృతుడి తండ్రి పంజాల భూపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Comments