అడ్డా కూలీలా "అండం"....బిచ్చగాళ్ళ "వీర్యం" !

వీర్యం, అండాల దందా బహిరంగం 

అడ్డా కూలీలా

 – బిర్యానీ, మద్యం ఆశ చూపి బిచ్చగాళ్ల నుంచి సేకరణ

హైదరాబాద్:

సంతాన భాగ్యం కోల్పోయిన దంపతులకు సాయంగా వీర్యం, అండాల దానం జరిగే పుణ్యపనిని కొందరు వ్యాపారంగా మార్చి అసభ్య మార్గంలో మలిచారు. సికింద్రాబాద్‌లో ఇండియన్ స్పెర్మ్‌టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట నడుస్తున్న ఈ దందాలో ఆరోపణలపై గోపాలపురం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఈ క్లినిక్ నిర్వాహకుడు పంకజ్ సోని, ఇతనితో కలిసి పనిచేసే మేనేజర్లు, ఏజెంట్లు, టెక్నీషియన్లు కలిసి వివిధ ప్రాంతాల్లోని బిచ్చగాళ్లు, రోజువారీ కూలీలను గుర్తించి వీర్యాన్ని సేకరిస్తుండగా, మహిళల నుంచి అండాలు కూడా సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు ఆశ చూపడం, బిర్యానీ ప్యాకెట్, మద్యం బాటిల్లు ఇవ్వడం వంటి ప్రలోభాల ద్వారా ఈ దందా సాగుతుందని సమాచారం.

చదువులేని, ఆరోగ్య ప్రమాణాలకు సరిపోని వ్యక్తుల నుంచి వీర్యం, అండాలను సేకరించి డబ్బు కోసం దాతలుగా వినియోగించిన ఈ వ్యవహారం ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా నైతికంగా కూడా తీవ్రంగా విమర్శించబడుతోంది.

ఆర్ట్ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) చట్టం ప్రకారం 21-55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఆరోగ్యవంతుల నుంచి మాత్రమే వైద్య పరీక్షల అనంతరం వీర్యం, అండాలను సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సార్లు మాత్రమే వీర్యం సేకరించవచ్చు. కానీ ఈ సంస్థ వారానికొకసారి చొప్పున ఒకే వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరిస్తూ చట్టాన్ని ఉల్లంఘించింది.

అలాగే, మహిళల నుంచి అండాలు సేకరించేందుకు ఆయా మహిళలను లాక్కొచ్చిన వారికి మాదకద్రవ్యాలు, బిర్యానీ ఇచ్చి పంపేవారిగా సమాచారం. అండదానం చేసిన మహిళలకు రూ.20 వేలు నుండి రూ.25 వేలు చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో నిందితులను మళ్లీ కస్టడీకి తీసుకుని మరింత లోతైన విచారణ చేపట్టేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .