జిల్లా అధికారులతో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

జిల్లా అధికారులతో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్ , నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియలు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలను మరింత బలపరిచే దిశగా ప్రతి పౌరుడూ కట్టుబడి ఉండాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ ప్రవేశికను పఠించి ప్రతిజ్ఞ చేయించారు.ప్రతిజ్ఞలో భాగంగా భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించేందుకు, అన్ని పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించేందుకు,ఆలోచన–భావప్రకటన–విశ్వాస–ధర్మ స్వాతంత్ర్యాలనుకాపాడేందుకు,సమానత్వాన్ని సాధించేందు కు, వ్యక్తిత్వ గౌరవం, జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉంటామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగాన్ని మనమంతా కాపాడుకోవాలని, అమలు చేయాలని ఈ కార్యక్రమం గుర్తుచేసిందని అధికారులు పేర్కొన్నారు.IMG-20251126-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .