అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం

అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం
అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తున్న బిసి సంక్షేమ సంఘం నాయకులు

తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:

రాష్ట్రంలో బీసీ కుల గణన ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం సమీపంలో కల రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ముందుగా కుల గణన ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిసి కుల గణన ప్రక్రియ మొదలు పెడుతూ జీఓ నెంబర్ 18ని విడుదల చేయడం సంతోషకరమని హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .