తెలంగాణ మట్టి వాసనకు ప్రతిబింబం అందెశ్రీ కవిత్వం

తెలంగాణ మట్టి వాసనకు ప్రతిబింబం అందెశ్రీ కవిత్వం

 టియూడబ్ల్యూజె(ఐజెయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణ

- ప్రెస్‌క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో అందెశ్రీకి ఘన నివాళులు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ మట్టి వాసనకు ప్రతిబింబం అందెశ్రీ కవిత్వమని టియూడబ్ల్యూజె(ఐజెయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా రచయిత, కాలమిస్ట్ అందెశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు జర్నలిస్టులు నివాళులర్పించారు. అనంతరం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నామా పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో కె.రాంనారాయణ మాట్లాడుతూ నిరుపేద, నిరక్షరాస్యుడైన అందెశ్రీ గొర్రెల కాపరి నుండి ప్రజాకవిగా ఎదిగాడని అన్నారు. పల్లె జీవితంలోని కన్నీళ్లు, కష్టాలు, ప్రకృతిలో మార్పులు, మనుషుల బాధలను లోతుగా గమనించడం, అనుభవించడం ద్వారా అందెశ్రీ సహజసిద్ధమైన, హృదయాన్ని కదిలించే ఆసు కవిత్వంతో అతితక్కువ సమయంలోనే ప్రజాకవిగా ఎదిగారన్నారు. తన పాటలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాంక్షను రగిల్చి లక్షలాది మందిని ఉద్యమ చైతన్యం వైపు నడిపించారన్నారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతమైందన్నారు. ఆయన జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మైసా పాపారావు, స్తంభాద్రి హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర కోశాధికారి ఏలూరి వేణు, ప్రెస్‌క్లబ్ కోశాధికారి కళ్యాణ్, ఉపాధ్యక్షులు గండారపు రామారావు, సహాయ కార్యదర్శి శివాజీ, నాయకులు మందా వెంకటేశ్వర్లు, టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .