అంగన్వాడి టీచర్లకు ట్యాబ్ లను అందించాలి
అంగన్వాడి టీచర్లు నారాయణమ్మ, రమాదేవి
పెద్దమందడి,ఆగస్టు21(తెలంగాణ ముచ్చట్లు):
అంగన్వాడి టీచర్లకు ట్యాబ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అంగన్వాడీ టీచర్లకు 5జి ట్యాబ్ లను అందించాలని గురువారం ఒక ప్రకటనలో అంగన్వాడీ టీచర్లు నారాయణమ్మ, రమాదేవి డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలు గురించి.... పోషణ ట్రాకర్ లో ఫోటోలను క్యాప్చర్ వాళ్ళ చేయడం టీచర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అన్నారు. 2020 ఫోన్లు ఇచ్చి నెల మొత్తం 2జీ వాడాలి అన్నారు. లోకేషన్ ట్రాకర్ యాప్ వచ్చింది.డైలీ అటెండన్స్ మాత్రమే వేయలి అన్నారు. ఆరు నెలల తరువాత 7-3 సంవత్సరాల పిల్లలకి ఇంటి వద్దకే ఇవ్వాలి అన్నారు. తరువాత చిన్నారుల హాజరు, గర్భిణీ బాలింతల హాజరు వేయాలని చెప్పారు. పిల్లల ఎదుగుదల 0-5 సంవత్సరాలు వేయాలనీ ఇలా ఒకటి తరువాత ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఎన్ హెచ్ టి ఎస్ యాప్ 2020వచ్చింది... అందులో కూడా ఇలాగే.... ఇచ్చింది. 2జీ యాప్ లు రెండు.2024 నవంబర్ నుండి ప్రిస్కూల్ ముఖాలు ఫోటోలు తీయడం, డైలీ హాజరు అలాగే పిల్లలు తల్లితండ్రు లు గర్భిణీ+బాలింత ల ఫేస్ క్యాప్చర్ ప్రతి నెల తీయాలి అంటూ.. అధికారులు వెంబడి పడుతున్నారు. వాళ్లు ఇచ్చింది 2జీ ఫోన్లు నేల మొత్తం వాడాలి. దీనిని సరిగా వాడితే ఒకరోజు కూడా రాదు. అలాంటిది నెల మొత్తం వాడాలంటారు. దీనివలన పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని అంగన్వాడి టీచర్లు వాపోతున్నారు. చిన్న ఫోన్లో ద్వారా అధికారులు ఇచ్చిన పనిని పూర్తి చేయలేక పని భారం ఎక్కువైందని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని వారు తెలిపారు. ఫోటో క్యాప్చర్, రోజువారి హాజరు వంటి అనేక పనుల పైన అధికారుల ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. ప్రిస్కూల్ నడవాలి అంటూనే ఫేస్ క్యాప్చర్ చేయడానికి టైం తీసుకుంటుంది ఆధార్ అప్డేట్ చాలా సమయం పడుతుందన్నారు.ప్రతినెలా ఫేస్ క్యాప్చర్ చేయాలి.... అంటే ప్రతి నెల పది రోజులు పడుతుంది . ఫోన్లు సహకరించక అంగన్వాడి టీచర్లకు ఇబ్బందులు అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం ట్యాబ్ లను అందించి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.
అలాగే అంగన్వాడి భవనం అద్దె సంవత్సరం అవుతుంది. సిలిండర్ బిల్స్ , కూరగాయలు బిల్స్, రావడం లేదు... ప్రతి బుధవారం గుడ్డు బిర్యానీ పెట్టాలి అంటారు... మసాలాలు ఇవ్వరు... ఒక పిల్లవాడికీ రోజు కి 60 పైసలు.. గర్భిణీ,బాలింతలకి 1-10పైసలు.. గవర్నమెంట్ కట్టిస్తుంది... అధికారులు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలి అంటారు.... ఎలా? సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఏమి కొనాలి అన్న రేట్ విపరీతంగా పెరిగాయి.. కానీ అంగన్వాడీ కి మాత్రం పని పెరుగుతుంది..తప్ప మెన్ ఛార్జి పెంచడం లేదు. వెంటనే అంగన్వాడి సమస్యలను పరిష్కరించి అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్ లను అందించాలని డిమాండ్ చేశారు.


Comments