అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి 

బండి రాజు వనపర్తి మాదిగ జర్నలిస్ట్ 

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి 

వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వనపర్తి మాదిగ జర్నలిస్టు  బండి రాజు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, అంబేద్కర్ ను అవమానించారని అందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని  అన్నారు. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అనడం ఫ్యాషన్ అయిందని వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ ని అవమానించారని అన్నారు . రాజ్యాంగం అంటే గౌరవం లేదని రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా  ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావించాల్సి ఉంటుందని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. దేశంలోని బహుజన బడుగు వర్గాల  మనోభావాలు దెబ్బతినే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మాదిగ జర్నలిస్ట్ బండి రాజు డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .