జనగామ జిల్లా ఎల్ఆర్ఎస్ యాప్ లో దరఖాస్తుదారుల వివరాలను సరైన విధంగా నమోదు చేయాలి

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు 

జనగామ జిల్లా ఎల్ఆర్ఎస్ యాప్ లో దరఖాస్తుదారుల వివరాలను సరైన విధంగా నమోదు చేయాలి

 జనగామ తెలంగాణ ముచ్చట్లు :

ప్రతి మండల కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ గురించి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ఎల్ఆర్ఎస్ యాప్ లో దరఖాస్తుదారుల వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుపింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ఎంపీడీఓలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఎల్ఆర్ఎస్ ల్యాండ్ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంయాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం ఎల్ఆర్ఎస్ కింద 52,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా ఈ ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఆర్ఐలు, ఇరిగేషన్ ఏఈలందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు అవగాహన కల్పించేందుకు వివరాల్లో కరెక్షన్స్ కోసం సంబంధించిన పత్రాలను సమర్పించాలని గ్రామ పంచాయతీల నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రతి మండల కార్యాలయంలో ఈ ఎల్ఆర్ఎస్ గురించి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారులకు తగిన సూచనలు అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా సర్వే నంబర్ ల ప్రకారం దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలని, దీంతో ఫీల్డ్ విజిట్ లో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ల్యాండ్స్, నిషేధిత ఆస్తుల వివరాల్లో భూములను కాపాడాలన్నారు. ఘనపూర్ (స్టేషన్), చిల్పూర్, జాఫర్గడ్ లు కుడా మాస్టర్ ప్లాన్ కిందికి వస్తున్నందున విలేజ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పును సరిచూసుకోవాలన్నారు. శనివారానికల్లా ప్రతి గ్రామ పంచాయతీల వారీగా వంద దరఖాస్తుల లక్ష్యంగా ఎల్ఆర్ఎస్ యాప్ లో ప్రణాళికాబద్ధంగా నమోదు చేయాలన్నారు. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసిన మూడు మండలాల బృందాలను ఎంపిక చేసి పురస్కరిస్తామని తెలిపారు

అనంతరం పాము కాట్లు, కుక్కల బెడదపై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ సందర్భంగా పాము, కుక్క కాటు వేసిన వెంటనే ఏరియా ఆసుపత్రికి తీసుకురావాలని, సొంత వైద్యం, పసరు మందులు ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, గ్రామాల్లో ప్రజలకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టి, అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం దృష్ట్యా జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున గ్రామాల్లో దోమల నివారణకు నీరు నిల్వకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీలలో పిచికారీ, ఫాగింగ్ చేయాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు

అనంతరం ఎంపిడిఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ ఎల్ఆర్ఎస్ యాప్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు

ఈ అవగాహన సమావేశంలో జెడ్పీ సీఈవో సరిత, డీపీఓ స్వరూప, ఈడీఎం గౌతమ్, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్ఐలు, నీటిపారుదల ఏఈలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .