ఇంటర్మీడియెట్ ఉచిత విద్య కోసం దరఖాస్తులకు ఆహ్వానం. 

ఇంటర్మీడియెట్ ఉచిత విద్య కోసం దరఖాస్తులకు ఆహ్వానం. 

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

వికారాబాద్ కేంద్రంగా నడుస్తున్న గయాసుద్దీన్ బాబు ఖాన్ చారిటబుల్ ట్రస్ట్(జీబీకే) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్ ఐ ఇ) జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉచిత సీటు కోసం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హెచ్ఐఈ డైరెక్టర్ జావేద్ హుద్ తెలిపారు. బుధవారం ఖమ్మం నగరంలోని సితార హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సదస్సులో  ఆయన మాట్లాడారు. విద్యార్థులుకు  (బాలురు)  డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ఆన్లైన్లో హైసెట్-25 పరీక్ష నిర్వహిస్తున్నట్లు హెచ్ఐఈ డైరెక్టర్ జావేద్ హుద్ అన్నారు.  విద్యావంతులు ,మేధావుల, విద్యార్థులు , తల్లిదండ్రుల తో జరిగిన హైసెట్-25  దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై అవగాహన సదస్సు లో ట్రస్టీ జావేద్ హుద్ మాట్లాడుతూ హెచ్ఐఈ కళాశాల 13 సంవత్స రాల నుంచి నాణ్యత ప్రమాణాలతో నడుపుతు న్నామని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన సౌక ర్యాలు కల్పిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా విద్యార్థులు 125 సీట్లకు ఈ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులు కావాలని కోరారు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపిసి, ఎంఇసి కోర్సుల్లో తమ కళాశాలలో ఉచితం గా విద్యనందిస్తామని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ (ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీ బీఎస్ కోసం), ఎంఈసీ కోసం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తో పూర్తి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అందిస్తున్నామన్నారు. సమగ్ర సమాచారం కోసం సెల్ నంబరు 9866556876 సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు హెచ్ టీటీపీ://హెచ్ఐఈఎస్ఈటీ డాటిన్ వెబ్సైట్లో సంప్రదించవచ్చని పేర్కొ న్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ మొయిన్ , ట్రస్ట్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ మలీక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .