చిల్పూర్ టిడిపి మండల అధ్యక్షుడిగా ఆరూరి రాజు 

పార్టీ పునర్వ్యవస్థీకరణ శ్రీకారం

చిల్పూర్ టిడిపి మండల అధ్యక్షుడిగా ఆరూరి రాజు 

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

చిల్పూర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆరూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ చర్యల నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆరూరి రాజు మాట్లాడుతూ, ఈ పదవికి తనను ఎంపిక చేసిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట రజనీకాంత్, ముంజ వెంకట్రాజ్యం గౌడ్ లకు తన ఎన్నికకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ పాల్గొని, నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. మండల, జిల్లా స్థాయి నాయకులు, యువజన విభాగం, మహిళా విభాగానికి చెందిన కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .