పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా
వద్దిరాజు' మరోసారి ఎన్నిక
Views: 12
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 3, తెలంగాణ ముచ్చట్లు;
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరోసారి పెట్రోలియం మరియు సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ సెకెరట్రి సుజయ్ కుమార్ శుక్రవారం నియామాక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులు గల ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ప్రాతినిద్యం వహిస్తారు.
ప్రతి రెండేళ్లకోసారి నియామాకం అయ్యే ఈ కమిటీకి రవిచంద్ర వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ దఫా పెట్రోలియం మరియు సహజ వాయువు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా లోక్ సభ ఎంపీ సునీల్ దత్తాత్రేయ తట్కరే కొత్తగా ఎన్నికయ్యారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments