సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి 

రాజ్యాంగంపై దాడి
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్

మల్కాజిగిరి, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలని డివైఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బొబ్బర శ్రీనివాస్ అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే అది ఒక వ్యక్తిపై దాడి కాదు — యావత్ రాజ్యాంగంపై దాడి. మత ప్రాతిపదికన పాలన చేయాలనుకునే మనువాద శక్తుల భావజాలాన్ని ప్రజలు గుర్తించి, సమానత్వ సమాజం కోసం పోరాడాలి” అని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పాల్గొన్న యువజనులు “మతోన్మాదం నశించాలి – మానవవాదం వర్ధిల్లాలి” అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజకుమార్, మండల నాయకులు చైతన్య, సంపత్, ప్రవీణ్, యల్లేష్, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .