దుబాయ్ డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకై నిర్వహించు ఇంటర్వ్యూకు హాజరు కావాలి .... 

-జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి

-ఇండియన్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

-ఈ నెల 20న నిర్వహించు ఇంటర్వ్యూకు హాజరు కావాలి

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

దుబాయ్ లో డెలివరీ బాయ్స్ గా పని చేయుటకు బైక్ రైడర్స్ కోసం ఈ నెల 20న హైదరాబాద్ విజయనగర కాలనీ లోని మల్లేపల్లి ఐ.టి. ఐ. క్యాంపస్ లో టాం కాం ద్వారా  నిర్వహించు ఇంటర్వ్యూ కు ఆసక్తి, అర్హత గల వారు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద నమోదు చేయబడిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ టామ్ కామ్ అని, దీని ద్వారా తెలంగాణ నుండి అర్హత, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు విదేశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రిజిస్టర్డ్ ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నదని తెలిపారు.
అభ్యర్థులు 21 నుండి 38 సంవత్సరాల వయస్సు కలిగి తప్పనిసరిగా కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై, 3 సంవత్సరాల పాతది డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇంటర్వ్యూ కు ఒరిజినల్ పాస్ పార్ట్ తప్పని సరిగా తీసుకురావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9440050951 / 9440049861 / 94400 51452 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .