పెండింగ్ దరఖాస్తుల పై దృష్టి సారించాలి ఎలక్ట్రోల్ అబ్జర్వర్ శ్రీ బాలమాయాదేవి.
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఎలక్ట్రోల్ అబ్జర్వర్ శ్రీ బాలమాయాదేవి.స్పెషల్ సమ్మరీ రివిజన్ 20 25, పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయదేవి కి పూల మొక్క ఇచ్చి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆమెకు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ ఐడి కార్డుల జారీ, పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లు తదితర అంశాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో షెడ్యూల్డ్ ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు, పెండింగ్లో ఉన్న ఫామ్ 6,7,8, లను వెంటనే పరిష్కరించాలని, దివ్యాంగ ఓటర్లను, గుర్తించాలని, షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, వారి యొక్క సలహాలు, సూచనలు ఎన్నికల కమిషన్కు పంపాలన్నారు, నాణ్యమైన ఓటరు ఏపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలన్నారు, ఓటర్ అవగాహన పై స్వీప్ ఆక్టివిటీస్, స్టార్ క్యాంపైనర్స్ ద్వారా డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ కాలేజ్ అన్ని విద్యాసంస్థలలో కార్యక్రమాలు నిర్వహించి ఓటరు నమోదు ఓటు హక్కు పై అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు,అన్ని పోలింగ్ కేంద్రాలలో , దివ్యాంగుల కోసం ర్యాంప్స్ ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, మరుగుదొడ్ల, విద్యుత్ సరఫరా సౌకర్యం, అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలుతీసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య,భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తాసిల్దార్లు, ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్, మరియు బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments