పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో జాగ్రత్తలపై అవగాహన

జిల్లా కలెక్టర్ మను చౌదరి 

పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో జాగ్రత్తలపై అవగాహన

మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్‌ను ఈ నెల 22వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.చెర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) స్మార్ట్ టెర్మినల్‌ (హైదరాబాద్ టెర్మినల్), సర్వే నెం. 183, ఫేజ్–III, మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మాక్ ఎక్సర్సైజ్ జరగనుందని పేర్కొన్నారు.పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, ప్రాణనష్టం తగ్గించేందుకు అవసరమైన చర్యలు, అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు.మాక్ డ్రిల్‌ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని, ఇందుకు ఐఓసీఎల్ యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ మాక్ డ్రిల్ ద్వారా విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .