సింగరేణిలో శ్రామిక చట్టాలపై అవగాహన.!

జె.వి.ఆర్ ఓసీ–2లో నూతన కోడ్‌ల వివరణ.

సింగరేణిలో శ్రామిక చట్టాలపై అవగాహన.!

సత్తుపల్లి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో సింగరేణి కంపెనీ జె.వి.ఆర్ ఓసీ–2లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శ్రామిక చట్టాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. బేస్ పనిముట్లశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో డీడీఎంఎస్ నాగుల్ మీరా, ప్రాంత ప్రధాన నిర్వాహకులు చింతల శ్రీనివాస్ పాల్గొని ఉద్యోగులకు నూతన శ్రామిక కోడ్‌ల అంశాలను వివరించారు.

వేతనాల కోడ్–2019, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, సామాజిక భద్రత కోడ్–2020, వృత్తి భద్రత–ఆరోగ్యం–పని పరిస్థితుల కోడ్–2020 వంటి నాలుగు ప్రధాన చట్టాల లక్ష్యాలు, వాటి అమలు విధానం, ఉద్యోగులకు వాటి ద్వారా లభించే ప్రయోజనాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ సంస్కరణలతో కార్మిక నిబంధనలు సులభతరం కావడంతో పాటు కార్మిక సంక్షేమం మెరుగుపడుతుందని, పారిశ్రామిక రంగ బలోపేతానికి కూడా ఇవి దోహదం చేస్తాయని దక్షిణ మధ్య మండల గనుల భద్రత ఉప మహాసంచాలకులు అభిప్రాయపడ్డారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను మెరుగైన రూపంలో మార్చడమే కొత్త కోడ్‌ల ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో జె.వి.ఆర్ ఓసీ–2 ప్రాజెక్టు అధికారి ఎన్వీఆర్ ప్రహ్లాద్, ప్రాజెక్టు ఇంజినీర్ డి. శ్రీనివాసరావు, ఎస్‌.ఓ‌.ఎం. బి. రాజేశ్వరరావు, సంక్షేమ అధికారి కె. శ్రీనివాస్, ఐఎన్‌టీIMG-20251125-WA0044యూసీ నాయకుడు ఎన్. రామారావు (పిట్ కార్యదర్శి), ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి సుధాకర్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .