టిప్పర్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

టిప్పర్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

ఎల్కతుర్తి, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని డిబిఎల్ రోడ్‌వర్క్స్‌ కంపెనీ పి.ఆర్వో ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్, ఎస్సై అక్కెనపెల్లి ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైవర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ — ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌, వాహన పత్రాలను కలిగి ఉండాలని, నిర్ణీత యూనిఫారం ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్‌స్పీడ్, ఓవర్‌లోడ్‌ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. వాహనాల సురక్షిత ప్రయాణం అత్యంత ముఖ్యం అని పేర్కొన్నారు.WhatsApp Image 2025-11-11 at 9.49.24 PM (1)

అలాగే, ఎలాంటి అప్రమత్త పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డిబిఎల్ సంస్థ ఉద్యోగులు, టిప్పర్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .