బాల సదనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి..... 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

బాల సదనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి..... 

బాల సదనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

బాల సదనాన్ని ఆకర్షణీయంగా
తీర్చిదిద్దాలని, దీనికి సంబంధించిన పనులను పకడ్బందీగా అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని బాల సదనం భవనాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాల పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ బాల సదనంలోని స్థలంలో ఉన్న బండలను తొలగించి భూమి చదును చేయాలని అధికారులకు తెలిపారు.  అక్కడ పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ఉయ్యాల, జారుడు బండ, షటిల్ కోర్ట్ వంటి వివిధ ఆటలకు ఏర్పాటు చేస్తూ మంచి ప్లే ఏరియా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


WhatsApp Image 2024-12-16 at 9.11.04 PMబాల సదనం భవనంలో అవసరమైన మరమత్తు పనులు చేపట్టాలని, భవనం గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, బాల సదనం సూపరింటెండెంట్ వరలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .